సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 మే 2020 (10:40 IST)

హీరోయిన్ కాకపోతే.. కార్డియాలజిస్ట్ అయ్యేదట.. ఎవరో తెలుసా.. హైబ్రిడ్ పిల్ల!

ఫిదా బ్యూటీ, మలర్ టీచర్ సాయిపల్లవికి పుట్టినరోజు నేడే. సాయిపల్లవి 27 ఏళ్లు పూర్తి చేసుకుంది. 28వ ఏట అడుగుపెట్టింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సాయిపల్లవి.. గ్లామర్ రోల్స్‌కు చాలాదూరంలో వుంటోంది. గుర్తింపును ఇచ్చే పాత్రలను ఎంచుకుని, నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపిస్తూ వస్తోంది. 
 
కోట్లు ఇచ్చిన గ్లామర్‌కు తాను దూరంగా వుంటానని చెప్పేసింది. సాయిపల్లవి ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి భాషల్లో నటించి దక్షిణాది హీరోయిన్‌గా ఎదిగిపోయింది. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురీ ధీక్షిత్, ఐశ్వర్యారాయ్ వీడియోలు చూసి సాయిపల్లవి డ్యాన్స్ నేర్చుకుంది. 
sai pallavi
 
కేరళలో జరిగే ఓనమ్ పండుగ అంటే సాయిపల్లవికి చాలా ఇష్టం. జార్జియాలో సాయిపల్లవి మెడిసిన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సినీ హీరోయిన్ కాకపోతే సాయిపల్లవి కార్డియాలజిస్ట్ అయ్యేది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా ''ధామ్ ధూమ్''లో సాయిపల్లవి నటించింది. కానీ ప్రేమమ్ ద్వారానే సాయిపల్లవికి స్టార్ డమ్ వచ్చింది. 
 
ప్రేమమ్’ మూవీతో సౌత్‌లో తిరుగులేని స్టార్ డమ్ దక్కించుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తర్వాత కాలంలో ఈ భామ తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసింది. అందంతో పాటు, అభినయంలో కూడా ఆకట్టుకోగల సామర్థ్యం సాయిపల్లవి సొంతం. అందుకే సౌత్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందీ హైబ్రీడ్ పిల్ల. 
 
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించి తెలుగు సినిమాకి పరిచయమయింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత నాని సరసన ఎం.సి.ఎ చిత్రంలో నటించింది. సూర్యా 36, కణం, మారి 2, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి చిత్రాలలొ నటించింది. 
 
ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో చైతు సరసన క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తయింది. 
 
మిగిలిన భాగాన్ని లాక్ డౌన్ తర్వాత పూర్తి చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన భాగాన్ని చైతు సమంతకు చూపించాడట. ఈ చిత్రంలో నాగ చైతన్య కంటే సాయి పల్లవి సాయి పల్లవి డామినేషన్ ఎక్కువగా ఉన్నట్లు సమంత గ్రహించిందట. ఇందులో సాయిపల్లవి యాక్టింగ్ అదిరిందని సినీ యూనిట్ వర్గాల సమాచారం. 
 
సాయిపల్లవి రికార్డులు...
ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ భామ తన డాన్స్‌తో కూడా మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఆ సినిమాలోని " వచ్చిండే పిల్లా మెల్లాగా వచ్చిండే" అనే పాటలో ఆమె వేసిన స్టెప్స్‌కి ప్రేక్షకులు నిజంగానే ఫిదా అయ్యారు. ఈ పాట యుట్యూబ్‌లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.
 
ఆ తర్వాత ధనుష్‌తో ఆమె చేసిన మారి 2 చిత్రంలో రౌడీ బేబి అనే సాంగ్‌ బాగా క్లిక్ అయింది. ఈ పాట కూడా రికార్డుని క్రియేట్ చేసింది. ఇంకేముంది.. నటనతో ఆకట్టుకుంటూ తనకంటూ గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి మరిన్ని రికార్డులు, అవార్డులు గెలుచుకోవాలని ఆశిస్తూ.. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం.. హ్యాపీ బర్త్ డే సాయిపల్లవి.