ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (09:23 IST)

అదేనాకు పిహెచ్‌డి- వెంకీ న‌న్ను చూడ్డానికే గోవా వ‌చ్చారు - క‌మ‌ల్‌హాస‌న్‌

Kamal Haasan, Venkatesh
Kamal Haasan, Venkatesh
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్  ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం స‌మ‌కూర్చారు. జూన్ 3న విడుద‌ల‌కానున్న'విక్రమ్  ప్రీరిలీజ్ వేడుక మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో అభిమానులు, శ్రేయోభిలాషుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.

 
యూనివర్సల్ హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ – ‘‘దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్‌గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు డ్యాన్స్‌ అసిస్టెంట్‌గా హైదరాబాద్‌ వచ్చాను. అప్పట్నుంచి నేను తెలుగు ఫుడ్‌ తింటున్నాను. నా కెరీర్‌లో ఎన్నో హిట్స్‌ను తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. డైరెక్టర్‌ బాలచందర్‌గారితో నేను 36 సినిమాలు చేశాను. అదే నా పీహెచ్‌డీ. నా స్టైల్, రజనీకాంత్‌ స్టైల్‌ ఆయన్నుంచే వచ్చాయి.  వెంకీగారు ఓసారి గోవాకు వస్తే, ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వచ్చారా? అన్నాను. మిమ్మల్ని చూడటానికి వచ్చానన్నారు. నాకు తెలిసింది చెప్పాను. ఆయనకు మరో వేవ్ వ‌చ్చింది. 


ఇప్పుడు నా బ్రదర్‌ ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను, వెంకీగారు ‘మర్మయోగి’ సినిమా చేయాల్సింది. చేసి ఉంటే మా కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచి ఉండేది. ‘విక్రమ్‌’ సినిమాకు మంచి టీమ్‌ కుదిరింది. ఈ సినిమా హిట్‌ మీ (ప్రేక్షకులు) చేతుల్లోనే ఉంది. డైరెక్టర్‌ లోకేశ్‌గారు నాలాగే (బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా) ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలాంటివారిని నేను మరింత గౌరవిస్తాను. ఇండియన్‌ ఫిల్మ్స్‌... పాన్‌ ఇండియా చాలదు.. పాన్‌ వరల్డ్‌. అది ప్రేక్షకులు  సహకారం లేకుండా జరగదు. మంచి సినిమాలు ఇవ్వండని మీరు డిమాండ్‌ చేయాలి. ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నేను మంచి సినిమాకు అభిమానిని’’ అన్నారు.