శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (19:41 IST)

కమల్ హాసన్ విక్రమ్ నుంచి ఫస్ట్ సింగల్ వీడియో వ‌చ్చేసింది

Kamal Haasan - vikram
Kamal Haasan - vikram
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్  ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. 'విక్రమ్' మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ 'మత్తుగా మత్తుగా' పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్.
 
స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఈ పాట ని మాస్, గ్రూవీ సాంగ్ గా డిజైన్ చేశారు. అదిరిపోయే బీట్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్ లో ఫ్యాన్స్ తో విజల్స్ వేయించేలా వుంది. ఈ పాటలో కమల్ హాసన్ డ్యాన్స్ మూవ్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ముఖ్యంగా తలపై షర్టు కప్పుకొని కమల్ హాసన్ చేసిన మాస్ డ్యాన్స్ ప్రేక్షకులని అలరిస్తుంది. కమల్ హాసన్ ఈ పాటని స్వయంగా పాడటం మరో ప్రత్యేకత. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంది.
 
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే స్టార్ హీరో సూర్య ఈ చిత్రంలో గెస్ట్ లో అలరించబోతున్నారు. కమల్ హాసన్ హీరోగానే కాకుండా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
ప్రధాన తారణంతో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
స్టార్ హీరో నితిన్‌ హోమ్ బ్యానర్ 'శ్రేష్ఠ్ మూవీస్' ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనుంది.  జూన్ 3న 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమౌతుంది.
 
తారాగణం: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు
 
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
రిలీజ్ : శ్రేష్ట్ మూవీస్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్