శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (16:01 IST)

ఎన్టీఆర్‌తో కలిసి నటించడం నా కల.. రణ్‌బీర్‌తో..?: జాన్వీ కపూర్

jhanvi kapoor
ఆర్ఆర్ఆర్ నటుడు ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ద్వారా తన కల నిజమైందని బాలీవుడ్ సుందరి, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో, తాను చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్‌కి అభిమానిని అని చెప్పుకొచ్చింది. 
 
శివ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం “దేవర”లో పని చేయడానికి సంతకం చేసినప్పుడు అతనితో కలిసి పనిచేయాలనే తన కల నెరవేరిందని ఆమె జాన్వీ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నట్లే.. త్వరలో తనకిష్టమైన హీరోలతో కలిసి నటిస్తానని భావిస్తోంది. 
 
ఈ క్రమంలో రణబీర్ కపూర్ కలిసి నటించే అవకాశం వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపింది.  కాగా, రామ్ చరణ్ తదుపరి చిత్రంలో నటించేందుకు జాన్వీ చర్చలు జరుపుతోంది. అంతా సవ్యంగా జరిగితే, రామ్ చరణ్ - బుచ్చిబాబుల పేరులేని స్పోర్ట్స్ డ్రామా జాన్వీ కపూర్ రెండవ తెలుగు చిత్రం అవుతుందని సినీ పండితులు అంటున్నారు.