గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2017 (18:26 IST)

దంగల్ రికార్డ్ బ్రేక్.. హాంకాంగ్‌లో మూడు రోజుల్లో రూ.2.95కోట్లు

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ సినిమా దంగల్ రికార్డు సృష్టిస్తోంది. దంగల్ చైనా సినిమా విడుదలై తొమ్మిది నెలలు కావొస్తున్నా హాంకాంగ్‌లోనూ సత్తా చాటుతోంది. కుస్తీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా హా

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ సినిమా దంగల్ రికార్డు సృష్టిస్తోంది. దంగల్ చైనా సినిమా విడుదలై తొమ్మిది నెలలు కావొస్తున్నా హాంకాంగ్‌లోనూ సత్తా చాటుతోంది. కుస్తీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా హాంకాంగ్‌లో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. 
 
ఈ సినిమా గురువారం హాంకాంగ్‌లో విడుదలైంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లో రూ.2.95 కోట్లు వసూలు చేసినట్టు సినీ మార్కెట్‌ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్‌ తెలిపారు. ముఖ్యంగా శనివారం భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
 
కుస్తీ యోధుడు మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌ జీవితకథ ఆధారంగా నితీశ్‌ తివారి రూపొందించిన ఈ మూవీ భారత సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఒక్క చైనాలోనే దాదాపు రూ.1200 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.