శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 18 అక్టోబరు 2018 (13:02 IST)

ప్రయాణికులను టార్చర్ పెట్టి ఆనందం పొందుతున్న ఎయిరిండియా : మంచు లక్ష్మీ

ఎయిరిండియా అధికారులపై టాలీవుడ్ హీరోయిన్ మంచు లక్ష్మీ మరోమారు మండిపడింది. ప్రయాణికులను టార్చర్ పెట్టి ఎయిరిండియా అధికారులు ఆనందం పొందుతున్నారంటూ ఆమె తీవ్ర విమర్శలు గుప్పించింది. 
 
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి కారణం చెప్పకుండా దాదాపు 4 గంటల పాటు తనను క్యూలైనులో నిలబెట్టారంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె గురువారం వరుస ట్వీట్లు చేసింది. 
 
ప్రయాణికులను ఎయిర్ ఇండియా అధికారులు కనీసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. దీంతో ఆహారం, నీళ్లు లేకుండా పలువురు ప్రయాణికులు పుణె ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారని తెలిపింది.
 
నిజానికి ఎయిర్ ఇండియా విమానం బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తొలుత బయలుదేరాల్సి ఉందని లక్ష్మి చెప్పింది. అయితే మరో నాలుగు గంటలైనా విమానం జాడ లేకుండా పోయిందని వెల్లడించింది. 
 
ఈ విషయంపై తాము గట్టిగా నిలదిస్తే ఎయిర్ ఇండియా అధికారి సమాధానం చెప్పకుండానే పారిపోయారని తెలిపింది. చివరికి తాను హైదరాబాద్‌కు ఫోన్ చేసి అడిగితేగానీ, వాతావరణం బాగోలేని కారణంగానే విమానం రద్దయినట్లు తెలిసిందని మంచు లక్ష్మి చెప్పింది.