ఆదివారం, 19 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2025 (18:48 IST)

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Aishwarya Rajesh, Ritika Nayak inaugurated Shubhapradam Shopping Mall
Aishwarya Rajesh, Ritika Nayak inaugurated Shubhapradam Shopping Mall
శుభప్రదం.. ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. గుంతకల్లు పట్టణంలో శుభప్రదం మెగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. రైల్వే స్టేషన్ రోడ్ లోని ఐడిబిఐ బ్యాంక్  ఎదురుగా బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం జరిగింది. 

ఈ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథులుగా గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు, గుంతకల్లు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి నంగినేని భవాని గారు హాజరయ్యారు. గుంతకల్లు పట్టణంలో శుభప్రదం మెగా షాపింగ్ మాల్ ఏర్పాటుపై ఎమ్మెల్యే జయరాం గారు, మున్సిపల్ చైర్ పర్సన్ భవాని గారు  షోరూం నిర్వాహకులకు శుభాశీస్సులు తెలియజేశారు. 
 
నమ్మకమైన నాణ్యతతో పాటు అందరికీ అందుబాటు  ధరల్లో ఉత్తమ సేవలను, అదిరిపోయే కలెక్షన్స్ ను, అద్భుతమైన ఫ్యాషన్ ను శుభప్రదం అందిస్తుందని శుభప్రదం షాపింగ్ మాల్ నిర్వాహకులు సత్తిబాబు గారు సునీత గారు ప్రసాద్ గారు తెలియజేశారు. 
గుంతకల్లు  పట్టణంలో తమ ఫస్ట్ స్టోర్  ఏర్పాటుపై అల్లకాస్ సత్యనారాయణ గారు ఆనందం వ్యక్తం చేశారు. 
ఈ మెగా షాపింగ్ మాల్ గుంతకల్లు ప్రజల ఫ్యాషన్, జీవనశైలిని మార్చబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు.  అందుబాటులో ఉండే ధరలలో అదిరిపోయే ఆఫర్లతో శుభప్రదం షాపింగ్ మాల్ ప్రజలకు ఆహ్వానం పలుకుతోందని అన్నారు.