గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 31 జులై 2020 (13:35 IST)

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో అల్లు అర్జున్ #AA21

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం గురించి ట్వీట్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రం వుంటుదంని తెలిపారు. ట్విట్టర్లో... ''నా తదుపరి చిత్రం #AA21ను కొరటాల శివ గారితో ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.

కొంతకాలం నిశ్శబ్దంగా దీనికోసం ఎదురుచూస్తున్నాను. సుధాకర్ గారు తన ఫస్ట్ వెంచర్ నాతో చేస్తున్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు. ఇంకా శాండీ, స్వాతి మరియు నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమను తెలుపుతోంది"
 
కాగా అల్లు అర్జున్ అల వైకుంఠపురము చిత్రంలో బ్లాక్ బ్లష్టర్ హిట్ కొట్టాడు. రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది ఆ చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె నటించింది. మరి కొరటాల దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు.