1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (14:34 IST)

కారు టైర్లపై స్టాఫ్ మార్క్ సిగ్నేచర్ "ఏఏ" డిజైన్ చేయించిన స్టైలిస్ స్టార్

aa signature
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. "పుష్ప" చిత్రంతో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈయన చేసే ప్రతి పనీ అది వైరల్ అయిపోతుంది. తాజాగా బన్నీ తన కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. ఆ టైర్లపై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకున్నారు. కారు టైర్లపై మార్క్ సిగ్నేచర్ "ఏఏ" మార్కు చేయించారు. 
 
అల్లు అర్జున్ తన బిజినెస్ వ్యవహారాల్లో ఇదే సంతకం పెడుతుంటాడు. ప్రస్తుతం ఇదే ఆయన లోగోగా మారింది. ఇపుడీ కారు, సిగ్నేచర్ మార్కు ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి.
aa allu car
 
బన్నీ ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. సునీల్, ఫహద్ ఫాజిల్‌లు కీలక పాత్ర పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ చిత్రం వచ్చే ఆగస్టు 15వ తేదీన విడుదలకానుంది.