శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (20:46 IST)

ఒకటి బతకాలంటే.. ఇంకోటి చావాల్సిందే.. పాయల్ డైలాగ్ అదుర్స్

గ్లామర్ హీరోయిన్ పాయల్‌ రాజ్‌పూత్‌ అనగనగా ఓ అతిథి చిత్రం ద్వారా మంచి మార్కులు కొట్టేసేందుకు సిద్ధమవుతోంది. ఆర్‌ఎక్స్‌ 100 భామ ఈ సినిమాలో ఆసక్తికర పాత్రతో అలరించేందుకు సిద్ధమైంది. పాయల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'అనగనగా ఓ అతిథి'కి పద్మనాభం దర్శకుడు. 
 
రాజా రామమూర్తి, చిదంబరం నటేశన్‌ నిర్మిస్తున్నాయి. చైతన్య కృష్ణ, ఆనంద్‌ చక్రపాణి, వీణా సుందర్‌ కీల పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఇందులో పాయల్‌ ప్రతినాయకురాలి ఛాయలున్న పాత్రలో నటించారు.
 
'ప్రతి మనిషికి.. ప్రతి నిమిషం ఆశలు పుడుతూనే ఉంటాయి..' అనే డైలాగ్‌లో టీజర్‌ ఆరంభమైంది. 'ఒకటి బతకాలంటే.. ఇంకోటి చావాల్సిందే.. అదే సృష్టి.. ఆరునూరైనా.. నేను చేయాలి అనుకున్నది చేసే తీరతాను' అంటూ పాయల్‌ ఆసక్తికర పాత్రలో కనిపించారు. ఇందులో ఆమె డబ్బుల కోసం హంతకురాలిగా మారినట్లు తెలుస్తోంది.