శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (11:21 IST)

అనుపమకు మళ్లీ అవకాశమిచ్చిన దిల్ రాజు.. మళ్లీ రామ్ సరసన?

హీరోయిన్ ''స్నేహ'' తర్వాత టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్‌కు మంచి క్రేజ్ వుంది. నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసిన అనుపమ.. ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతోపాటు కరుణాకరన్ సినిమా కూడా చేస్తోంది. తాజా

హీరోయిన్ ''స్నేహ'' తర్వాత టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్‌కు మంచి క్రేజ్ వుంది. నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసిన అనుపమ.. ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతోపాటు కరుణాకరన్ సినిమా కూడా చేస్తోంది. తాజాగా హీరో రామ్‌తో రెండోసారి నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. రామ్-అనుపమ ఇప్పటికే ''ఉన్నది ఒకటే జిందగీ'' అనే సినిమాలో నటించారు. 
 
ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. అయితే నిర్మాత దిల్ రాజు తన తదుపరి సినిమా కోసం రామ్ సరసన అనుపమను నటించే అవకాశాన్నిచ్చారు. ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించనున్నాడు. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్నారు.