గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (18:02 IST)

అక్ష‌రాభ్యాసం చేసింది బాబాయే - క‌ళ్యాణ్‌రామ్‌

Nandamuri Kalyanram
Nandamuri Kalyanram
ఎన్‌.టి.ఆర్‌. కుటుంబంలో వార‌సుడిగా వ‌చ్చిన న‌టుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌. తాజాగా `బింబిసార‌` అనే చారిత్ర‌క నేప‌థ్యం గ‌ల సినిమాలో న‌టిస్తూ నిర్మించారు. ఈ చిత్రం ఆగ‌స్టు 5న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా త‌న గ‌తాన్ని గుర్తుచేసుకున్నారు.
 
అది 1989వ సంవ‌త్స‌రం నేను 7వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాను. నాన్న‌గారికి ద‌గ్గ‌రికి బాబాయ్ (బాల‌కృష్ణ‌) వ‌చ్చి క‌ళ్యాణ్‌ను చైల్డ్ ఆర్టిస్టుగా ప‌రిచ‌యం చేస్తాన‌న్నారు. నాకు సినిమా అంటే మ‌న‌సులో వుంది. తాత‌గారు, బాబాయ్, నాన్న‌గారు న‌టించారు. అయితే చ‌దువుకునే వ‌య‌స్సులో మ‌రో ఆలోచ‌న ఎందుకు అని నాన్న‌గారి అభిప్రాయం. వ‌ద్ద‌న్నారు. అది నేను చూసుకుంటాన‌ని బాబాయ్ న‌న్ను బాల‌న‌టుడిగా కెమెరాముందు నిల‌బెట్టారు. 
 
కెమెరా ఫేస్ చేయ‌డం తెలీదు. యాక్ష‌న్ అన‌గానే డైలాగ్ చెప్పాల‌ని తెలీదు. అంతా కొత్త‌గా వుంది. అందుకే నాకు ప్ర‌తీదీ అక్ష‌రాభ్యాసంలా చేసి చూపించారు బాబాయ్‌. ఆ సినిమానే `బాల‌గోపాలుడు`. సినీ జీవితంలో అది మ‌ర్చిపోలేను. ఇప్పుడు బింబిసార చేశాను. ప్రేక్ష‌కుల ఆశీస్సులు కావాల‌ని కోరారు.