శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (14:10 IST)

నాలుగు సినిమాల‌తో జ్యాపి స్టూడియోస్ నిర్మాణ సంస్థ‌ - ఆల్‌ది బెస్ట్ చెప్పిన అనిల్‌రావిపూడి

Anil Ravipudi, Jagamemaya, KL Damodar Prasad, Patang, Anudeep, Raj Tarun, Suhas, Dhanya Balakrishna
Anil Ravipudi, Jagamemaya, KL Damodar Prasad, Patang, Anudeep, Raj Tarun, Suhas, Dhanya Balakrishna
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ జ్యాపి(Xappie) చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్‌ కి శ్రీకారం చుట్టింది. జ్యాపి యాప్ ని రూపొందించిన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి 'జ్యాపి స్టూడియోస్' పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు అనుదీప్, నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ, రాజా రవీంద్ర, ముఖ్య అతిధులుగా బ్యానర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వేడుకగా జరిగిన బ్యానర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి 'జ్యాపి స్టూడియోస్' బ్యానర్, పోస్టర్ ని లాంచ్ చేశారు. 'జ్యాపి స్టూడియోస్' లాంచ్ ఈవెంట్ లో మొత్తం నాలుగు చిత్రాలని ప్రకటించారు నిర్మాతలు.
 
'జ్యాపి స్టూడియోస్' నిర్మాణంలో ప్రస్తుతం షూటింగ్ లో వున్న 'జగమేమాయ' పోస్టర్ ని లాంచ్ చేశారు నిర్మాత  కె ఎల్ దామోదర్ ప్రసాద్.
 
-  మరో చిత్రం 'పతంగ్' పోస్టర్‌ని లాంచ్ చేసిన దర్శకుడు అనుదీప్.. పతంగ్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 
- అదేవిధంగా రాజ్ తరుణ్ హీరోగా ప్రొడక్షన్ నెంబర్ 3. రూపుదిద్దుకోనుంది.
 
సుహాస్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకాబోతున్న ప్రొడక్షన్ నెంబర్ 4ని పోస్టర్ ని  ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ లాంచ్ చేసి నిర్మాతలకు అభినందనలు తెలిపారు.
 
రాజ్ తరుణ్, సుహాస్, ధన్య బాలకృష్ణ, చైతన్య, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు.
 
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం రంగంలోకి అడుగుపెతున్న 'జ్యాపి స్టూడియోస్'కి నా బెస్ట్ విశేష్. జ్యాపి స్టూడియోస్' త్వరలో నాలుగు ప్రాజెక్ట్స్ ని మొదలుపెట్టబోతుంది. ఈ ప్రాజెక్ట్ మంచి విజయాలని సాధించాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కోటుంది. అందరూ ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన 'జ్యాపి స్టూడియోస్'కి బెస్ట్ విశేష్'' తెలిపారు.
 
నిర్మాత ఉదయ్ కోలా మాట్లాడుతూ..  ప్రస్తుతం పరిశ్రమలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు అలవర్చుకోవడం కూడా అంత సులభం కాదు. అందుకే నిర్మాణం అంటే ఒక సవాల్ గా మారిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితులని త్వరలోనే సర్దుకుంటాయని ఆశిస్తున్నాను. ఆడియన్స్ కి చాలా కంటెంట్ అవసరం వుంది. ఆ నమ్మకంతోనే 2019లో జ్యాపి ఎంటర్టైన్మెంట్ పోర్టల్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ స్టార్ చేశాం. ఇండస్ట్రీని అవగాహన చేసుకున్నాం. సినిమాలు డిజిటల్ ప్రమోషన్స్ కూడా చేశాం. తర్వాత యూట్యూబ్ వీడియో కంటెంట్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశాం. ఫైనల్ గా  మన కోసం మనమే కంటెంట్ ని బిల్డ్ చేసుకోవాలని నిర్ణయించాం. చాలా కంటెంట్ బిల్డ్ అయ్యింది. ఇప్పటికే అప్డేట్స్ చూశారు. సంజీవ్ రెడ్డి, నాని బండ్రెడ్డి , డైరెక్టర్ ఆదినారాయణ, చైతన్య, ఆర్కే వీళ్ళంతా మా ప్రయాణంలో తోడుగా నిలబడ్డారు. ప్రేక్షకులందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
 
విజయ్ శేఖర్, కృష్ణ గొర్రెపాటి మాట్లాడుతూ.. ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. మంచి కంటెంట్ మీ ముందుకు వస్తాం. మీ అందరి సహకారం కావాలి'' అని కోరారు.
 
రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. జ్యాపి స్టూడియోస్'కి ఆల్ ది బెస్ట్ . 'జ్యాపి స్టూడియోస్' నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నా. కథ చాలా బావుంది. షూటింగ్ కోసం ఎక్సయిటింగా ఎదురుచూస్తున్నా. టైటిల్ తో పాటు మిగతా వివరాలు త్వరలోనే వేల్లదిస్తాం. మిగతా ప్రాజెక్ట్స్ కి కూడా ఆల్ ది వెరీ బెస్ట్' తెలిపారు.
 
సుహాస్ మాట్లాడుతూ.. మా నిర్మాతలకు కృతజ్ఞతలు. రామ్ పసుపులేటి ఐదేళ్ళుగా ట్రావెల్ చేస్తున్నా. ఫైనల్ గా అందరికీ నచ్చిన కథ ఓకే అయ్యింది. ఇది ఫాంటసీ డ్రామా.  మీ అందరికీ చూపించాలని ఎదరు చూస్తున్నాను'' అన్నారు
 
నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..'జ్యాపి స్టూడియోస్' నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. సినిమా తీస్తామని నిర్మాతలు నా దగ్గరకి వస్తే వాళ్ళని నిరాశపరుస్తానని చాలామంది అనుకుంటారు. నిజానికి నేను సరైన హోమ్ వర్క్ చేయమని అడుగుతాను. నిర్మాత తప్పకుండా హోం వర్క్ చేయాలి.  'జ్యాపి స్టూడియోస్' నిర్మాతలు వెబ్ పోర్టల్, యాప్ నిర్వహించి ఇండస్ట్రీని దగ్గర నుండి గమనించామని చెప్పారు. నిర్మాతలకు చాలా క్లారిటీ వుండాలి. ..'జ్యాపి స్టూడియోస్' కి నా బెస్ట్ విశేష్. 'జగమేమాయ' టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్'' తెలిపారు.
 
ధన్య బాలకృష్ణ: మాట్లాడుతూ.. 'జ్యాపి స్టూడియోస్'తో నాకు మంచి అనుబంధం వుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఉదయ్ గారు నన్ను ఎంతగానో నమ్మారు. ఆయన నమ్మకాన్ని నిలబెడతాననే నమ్మకం వుంది. సినిమా నిర్మాణంలో ఉదయ్ గారి ఇన్వాల్మెంట్ అద్భుతంగా వుంటుంది. ప్రతి దశలో ఆయన యూనిట్ కి అండగా నిలబడతారు. దర్శకుడు సునీల్ గారు అద్భుతమైన దర్శకుడు. మనిషి వ్యక్తిత్వాన్ని 'జగమేమాయ' చాలా విలక్షణంగా ఆవిష్కరించారు. చైతు గారితో పాటు మిగతా నటీనటులు టీం కలసిపని చేయడం మంచి అనుభూతి. 'జ్యాపి స్టూడియోస్' మార్వల్ స్టూడియోస్ అంత గొప్ప బ్యానర్ కావాలి'' అని కోరుకుంటున్నాను.
 
చైన్యత మాట్లాడుతూ.. జ్యాపి యాప్ దశలో ఉన్నప్పటి నుండి ఉదయ్ గారి దగ్గర పని చేస్తున్నాను. ఇది నా హోం బ్యానర్ లాంటింది. జ్యాపి ఈ రోజు నిర్మాణ రంగంలోకి రావడానికి ఉదయ్ గా ఋ ఎంత శ్రమించారో నాకు తెలుసు. ఉదయ్, శేఖర్, కృష్ణ గారు ఈ రోజు కోసం చాలా కష్టపడ్డారు. 'జగమేమాయ'ని దర్శకుడు సునీల్ అద్భుతంగా తీశారు. 'జ్యాపి స్టూడియోస్' మీ ముందుకు అద్భుతమైన కంటెంట్ తీసుకురాబోతుంది.  'జగమేమాయ'ని అందరూ ఆదరించాలి'' అని కోరుకున్నారు.
 
పతంగ్ దర్శకుడు ప్రనీత్ మాట్లాడుతూ.. పంతంగ్ ఫన్ రోమ్ కామ్. చాలా  వైబ్రెంట్ గా వుంటుంది. కైట్ ఫ్లయింగ్ పోటీల నేపధ్యంలో ఈ సినిమా వుంటుంది. ఇండియాలో ఇదే మొదటి కైట్ ఫ్లయింగ్ నేపధ్యంలో వస్తున్న సినిమా. చాలా ఫ్రెష్ గా వుంటుంది.
 
ప్రణవ్ కౌశిక్ మాట్లాడుతూ..  నేను సరిగమప లో సింగర్ ని. పంతగ్ తో నటుడిగా పరిచయం అవుతున్నా. నేను ఇప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు. కష్టపడి ఇంకొన్నేలలో నాపేరు తెలిసేలా చేస్తాను. ఫేం కోసం కాదు గానీ ఫిలిం మేకింగ్ అంటే నాకు చాలా ప్యాషన్. దర్శకుడు ప్రనీత్, నిర్మాతలకు కృతజ్ఞతలు. జ్యాపి స్టూడియోస్ కి కంగ్రాట్స్'' అన్నారు.
 
వంశీ మాట్లాడుతూ..  పంతగ్ న్యూఏజ్ కమర్షియల్ ఫిల్మ్. దర్శకుడు ప్రణీత్ చాలా మంచి రైటర్. భవిష్యత్ లో పెద్ద దర్శకుడు అవుతారు. ఉదయ్ గారు వండర్ ఫుల్ ప్రొడ్యుసర్'' అన్నారు
 
శ్రీనివాస్ వడ్లమాని మాట్లాడుతూ.. జీవితమే కాదు సినిమా కూడా నది లాంటింది. ఎప్పుడూ కదులుతూనే వుంటుంది. ఈ కదలికలో అంతా కొత్త నీరు వస్తుంది.  ఈ సినిమా కూడా కూడా ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతుంది. చాలా కొత్త కంటెంట్, వేదికలు వస్తున్నాయి. ఉదయ్ గారి ఆల్ ది బెస్ట్'' తెలిపారు