శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (17:41 IST)

మూడు భాషాల్లో విడుదలకు సిద్దంగా ఉన్న బాబు

Babu poster
Babu poster
అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్‌గా రాబోతోన్న చిత్రం ‘బాబు’. ట్యాగ్ లైన్ ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ మీద దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు.  విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. 
 
ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సిద్దం కానుంది. ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక మున్ముందు మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచనున్నారు మేకర్లు.
 
తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో రాబోతోన్న ఈ చిత్రంలో అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లాపు, ఎంఎల్ఆర్, సోనాలి, మురళీధర్ గౌడ్, భద్రం, జబర్దస్త్ అప్పారావు, రవి వర్మ, సునిత మనోహర్, అశోక్ వర్దన్, భద్రి జార్జి తదితరులు నటిస్తున్నారు.