సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (11:08 IST)

అరకులో చంద్రబాబు.. రా కదలిరా సభలో ప్రసంగం

Chandra Babu
టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అరకులోయలో పర్యటించనున్నారు. అరకులోయలో ‘రా.. కదలిరా’ సభలో ఆయన పాల్గొననున్నారు. సుమారు రెండున్నర గంటల పాటు అరకులో చంద్రబాబు ఉండనున్నారు.  చంద్రబాబు సభ కోసం టీడీపీ శ్రేణులు భారీ జనసమీకరణ చేస్తున్నాయి. 
 
డుంబ్రిగుడ మండలం అరకు గ్రామ సమీపంలో జైపూర్ జంక్షన్ వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి. అరకులో శనివారం జరగనున్న చంద్రబాబు బహిరంగ సభకు వేపాడ మండలం నుండి టిడిపి శ్రేణులు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా బయలుదేరి వెళుతున్నారు. 
 
వేపాడ మండల పార్టీ అధ్యక్షులు గొంప వెంకటరావు, నియోజకవర్గ టిడిపి మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి సారధ్యంలో వందలాదిగా టిడిపి శ్రేణులు చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ తరలి వెళ్తున్నారు.