బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (19:21 IST)

భీమా చిత్రం మహా శివరాత్రికి సిద్ధమవుతోంది

Bhima - Gopichand
Bhima - Gopichand
గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా' టీజర్ తో హ్యాజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. గోపీచంద్, మాళవిక శర్మల అందమైన కెమిస్ట్రీని చూపించిన ఇటీవల విడుదలైన ఫస్ట్  సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మించిన ఈ చిత్రం సెకండ్ సింగిల్ గల్లీ సౌండుల్లో పాటని విడుదల చేశారు.  
 
లైవ్లీ కంపోజిషన్‌కు పేరుపొందిన రవి బస్రూర్ గూస్‌బంప్స్ తెప్పించే మ్యాసీవ్ ట్రాక్‌ని స్కోర్ చేసారు. గోపీచంద్ పాత్ర గురించి చెప్పే టైటిల్ ట్రాక్ ఇది. తను నేరస్తులను భయపెట్టే ఆరోగెంట్ పోలీసు. సంతోష్ వెంకీ వోకల్స్ పాటలోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కంపోజర్ రవి బస్రూర్, సింగర్ సంతోష్ వెంకీ కలిసి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. అద్భుతమైన కంపోజిషన్, సాహిత్యం, పవర్ ఫుల్ వోకల్స్ తో ఈ పాట మాస్ ని అలరిస్తోంది.
 
ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ, రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు
 'భీమా' చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది.