శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (15:38 IST)

గౌరీ ఖాన్ తో వ్యానిటీ వ్యాన్‌ని డిజైన్ చేయాలని కోరుకున్న బిగ్ బి

gowri-amitab
gowri-amitab
ఇటీవల బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన మనసులోని మాటను షారూక్ కు చెప్పాడు. కానీ వర్క్ జరగలేదు అంటూ. ఓ టీవీ ఎపిసోడ్లో బచ్చన్ ఇలా అన్నాడు: "కొన్ని రోజుల క్రితం, నేను షారుఖ్‌తో షూటింగ్ చేస్తున్నాను, మాట్లాడుతున్నప్పుడు నేను అతని వ్యాన్‌లోకి వెళ్లాను. అతని వ్యాన్ చాలా అందంగా ఉంది. ఇది చాలా బాగా డిజైన్ చేయబడింది, దీనికి టీవీ, టేబుల్, కుర్చీలు ఉన్నాయి, వీటిని కదిలించవచ్చు. మేకప్‌కి కూడా స్థలం ఉంది, టాయిలెట్ కూడా ఉంది.
 
అద్భుతంగా ఉంది.. ఎవరు డిజైన్ చేస్తుండారు.  అని అడిగితే గౌరీ డిజైన్‌ చేసిందని షారూక్  చెప్పాడు, నిజానికి నా వ్యాన్‌ని కూడా డిజైన్ చేయమని ఆమెను అడుగుతానని అమితాబ్ చెప్పాడు. కానీ గౌరి మీ మాట విందేమో ఇంకా రాలేదు అనేసరికి అప్పుడు బిగ్ బి పెద్దగా నవ్వారు.  జరిగిన ఎపిసోడ్ ను షారూక్ మెచ్చుకున్నాడు. గౌరి కూడా అమితాబ్ కంటే ఎవరు సాటిరారని కితాబిచ్చింది.