మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (15:11 IST)

నేడు బిగ్ బాస్-5 గ్రాండ్ ఫినాలే : ఒకేచోట బాలీవుడ్ - టాలీవుడ్ తారలు

గత మూడు నెలలుగా బుల్లితెర ప్రేక్షకులను ఆలరిస్తున్న "బిగ్ బాస్ రియాల్టీ షో ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే" పోటీలు ఆదివారం జరుగనుంది. ఈ ఐదో సీజన్ పోటీలు ఆదివారంతో ముగియనున్నాయి. దీంతో ఈ ఫైనల్ పోటీని గ్రాండ్‌గా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ గ్రాండ్ ఫైనల్ వేదికపై బాలీవుడ్, టాలీవుడ్ తారలు సందడి చేయనున్నాయి. 
 
ముఖ్యంగా, "పుష్ప" చిత్ర దర్శకుడు కె.సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్నా, సంగీతర దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, "ఆర్ఆర్ఆర్" చిత్రం కోసం దర్శక ధీరుడు ఎస్ఎస్ఎస్ రాజమౌళి తదితరులు హాజరవుతున్నారు. 
 
అలాగే బాలీవుడ్ మూవీ "బ్రహ్మాస్త్ర" మూవీ ప్రమోషన్ కార్యక్రమాల కోసం బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్, "శ్యామ్ సింగరాయ్" ప్రమోషన్ కోసం నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి వంటి అనేక మంది తారలు వేదికపై సందడి చేయనున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ బిగ్ బాస్ ఐదో సీజన్ వీక్‌లో సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, మానస్, సిరిలు ఉన్నారు. అయితే, ఈ ఐదో సీజన్‌లో సిరి విజేతగా నిలిచినట్టు శనివారం నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.