శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 8 జులై 2017 (12:36 IST)

#BiggBossTeluguOnJuly16 : 'అదీ మ్యాటర్.. వెయిట్ చేయండి.. కలిసే చూద్దాం'.. ప్రోమో రిలీజ్

జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రధాన వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఈనల 16వ తేదీ నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ రియాల్టీ షోకు సంబంధించిన మరో ప్రోమోను టీవీ నిర్వాహకులు శనివారం రిలీజ్ జేశారు. ఇప్పటికే రెండు మూడు

జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రధాన వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఈనల 16వ తేదీ నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ రియాల్టీ షోకు సంబంధించిన మరో ప్రోమోను టీవీ నిర్వాహకులు శనివారం రిలీజ్ జేశారు. ఇప్పటికే రెండు మూడు టీజర్లతో బిగ్‌బాస్‌పై ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ఎన్టీఆర్ తాజాగా విడుదలైన ప్రోమోతో మరింత ఆసక్తి పెంచాడు.
 
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో చూసేందుకోసం ఎన్టీఆర్ నక్కినక్కి నడుస్తూ వెళ్లడం ఈ ప్రోమోలో కనిపిస్తుంది. లోపల ఏమేం జరుగుతోందో.. ఏయే కంటెస్టెంట్ ఏమేం చేస్తున్నారో అనేదాన్ని కొంచెం కొంచెం చూపిస్తూ ప్రేక్షకులను ఊరిస్తున్నారు. షార్ట్ డ్రెస్‌తో ఎంతో స్టయిల్‌గా వచ్చిన ఓ యువతి మాబ్ స్టిక్‌తో ఇల్లు తుడుస్తుంటే.. సూటూ బూటూ వేసుకున్న మరో వ్యక్తి వంట రూంలో చపాతీలు తిక్కుతుంటే ఆ దృశ్యాన్ని చూసి ఎన్టీఆర్ పకపకా నవ్వుతుంటారు. 
 
‘‘ఎక్కడికి?.. ఇంకా చాలా ఉంది. రండి’’ అంటూ మరో దృశ్యాన్ని చూపిస్తాడు. ఒక్కో వేలికి ఒక్కో బంగారు ఉంగరం పెట్టుకుని మెడలో మెరిసిపోతున్న బంగారు గొలుసుతో వైట్ అండ్ వైట్ వేసుకున్న ఓ వ్యక్తి ఆఖరికి బట్టలు ఉతికే పని చేయడం.. ఇక ఆ హౌస్‌లో ఉన్నవాళ్లంతా వాళ్లకు ఉన్న ఓకే ఒక్క టాయిటెల్ ముందు క్యూలో ఎప్పుడెప్పుడు లోపలికి వెళతామా అన్నట్టు ఆపతాపాలు పడుతున్న సీన్ చూసి ‘‘అదీ మ్యాటర్.. వెయిట్ చేయండి. కలిసే చూద్దాం.’’ అని ఎన్టీఆర్ ఓ చిన్న నవ్వు నవ్వి, కన్ను గీటడంతో ఈ ప్రోమో ముగుస్తుంది.