శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (14:16 IST)

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 : ఎపిసోడ్ 2 హైలైట్స్.. హేమ ఆ ఆరుగురిని..? (video)

ప్రతిష్టాత్మక బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో మూడో సీజన్ ప్రారంభమైంది. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ షోలో వ్యాఖ్యాత కింగ్ నాగార్జున పార్టిసిపెంట్స్‌ను పరిచయం చేశారు. ప్రస్తుతం రెండో ఎపిసోడ్‌ సోమవారం రాత్రి ప్రసారం అయ్యింది.  హౌజ్‌లోకి ఎంటరిచ్చారు. హౌజ్‌లోకి నాగార్జునకు ఆహ్వానం పలికిన బిగ్ బాస్ ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారు. 
 
15 మంది కంటెస్టెంట్లలో మొదటి ముగ్గురినీ ఎంపిక చేయాలని నాగార్జునకు సూచించారు. ఈ ముగ్గురిలో మొదటిగా యాంకర్ శివజ్యోతి అలియాస్ ‘తీన్మార్’ సావిత్రిని వేదికపైకి నాగార్జున పిలిచారు. ఆ తరవాత టీవీ నటుడు రవికృష్ణను రెండో కంటెస్టెంట్‌గా.. సోషల్ మీడియా సెన్సేషన్, నటి అశురెడ్డిని మూడో కంటెస్టెంట్‌గా ఆహ్వానించారు. ఆ తరవాత జర్నలిస్టు జాఫర్‌ను పరిచయం చేశారు. 
 
ఐదో కంటెస్టెంట్‌గా నటి హిమజ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. 14, 15 కంటెస్టెంట్లుగా వచ్చిన హీరో వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వితికా షెరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బిగ్ బాస్ హిస్టరీ‌లో ఒక కపుల్ కంటెస్టెంట్స్‌గా రావడం ఇదే తొలిసారి మరో విశేషం. ఇక రెండో ఎపిసోడ్‌లో శివజ్యోతి, రవి, అశు రెడ్డిలకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. వీరు తమకిచ్చిన టాస్క్‌ను పూర్తి చేసి.. రాహుల్, బాబా, జాఫర్, వరుణ్ సందేశ్, వితికా, శ్రీముఖిల పేర్లను చెప్పారు. వీరి పేర్లు బిగ్ బాస్ నామినేషన్ కింద తీసుకున్నట్లు చెప్పారు. 
 
తర్వాత బిగ్ బాస్ కంటిస్టెంట్లకు బిగ్ బాస్ డిన్నర్ పంపారు. తర్వాత శ్రీముఖి, అలీ రెజాలు నామినేషన్ గురించి మాట్లాడుకున్నారు. ఇక హిమజ అందరికంటే ముందుగా నిద్రలేచింది. వెంటనే రెడీ అయి.. తన పని చేసుకుపోయింది. ఆపై అందరూ నిద్రలేచారు. వీరికి బిగ్ బాస్ గ్రాసరీలు, ఫుడ్ పంపారు. హిమజ బిగ్ బాస్ హౌజ్‌లోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. 
 
మహేష్, రాహుల్‌లకు బాత్ రూమ్ క్లీనింగ్ అసైండ్ చేయడం జరిగింది. తర్వాత బిగ్ బాగ్ నామినేషన్ అయిన ఆరుగురికి ఆపర్చునిటీ ప్రకటించారు. నామినేషన్ పద్ధతి ప్రకారం తమను సేవ్ చేసుకునే ఆఫర్‌ను ఇచ్చారు. ఆరుగురు నామినేషన్ అయిన హౌస్‌మేట్స్‌కు హేమ మానిటర్ చేస్తారు. హేమకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. హేమ మానిటర్ ప్రకారం ఆరుగురు ఎలిమినేట్ అవుతారా.. సేఫ్ జోన్‌కు వెళ్తారా అనేది తేలుతుంది.