శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : మంగళవారం, 21 మే 2019 (19:45 IST)

బిగ్‌బాస్-3 కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో ఉదయభాను, గుత్తా జ్వాలా ఉన్నారా?

తెలుగు బిగ్‌బాస్-3 సీజన్ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో గానీ, జూలైలో గానీ ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్‌గాస్-3లో పాల్గొనే కంటెస్టెంట్‌లు వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
అందులో యాంకర్ ఉదయభాను, నటి శోభితా ధూళిపాళ, టీవీ నటుడు జాకీ, హీరో వరుణ్ సందేశ్, చైతన్య కృష్ణ, మనోజ్ నందన్, కమల్ కామరాజ్, డ్యాన్స్ మాస్టర్ రఘు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాలా, యూట్యూబర్ జాహ్నవి దాసెట్టి, సింగర్ హేమచంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..