తల్లి కాబోతున్న బిపాసా బసు.. ఇన్ స్టాలో ఫోటోలు వైరల్
బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాషా బసు తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో రొమాంటిక్ ఫోజుల్లో దిగిన ఫొటోలను పంచుకుంటూ త్వరలోనే తాము తల్లిదండ్రులం కానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో పాటు ఓ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది.
"మా మాధ్య ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం. త్వరలోనే మా బిడ్డ మా ఇంట్లోకి అడుగుపెట్టనుంది. మీరు మాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞురాలిని" అంటూ ఆ నోట్‌లో రాసుకొచ్చింది బిపాసా. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు బిపాసా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.