గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 29 ఏప్రియల్ 2021 (15:27 IST)

మృతదేహాలను సామూహికంగా దహనం చేస్తున్నారు, నా దేశం రక్తమోడుతోంది, ప్లీజ్ సాయం చేయండి

భారతదేశంలో కరోనా విజృంభణపై ప్రపంచ దేశాలు ఆవేదన, సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు తమవంతు సాయాన్ని ప్రకటించాయి. కాగా విదేశాల్లో వున్న భారతీయ పౌరులు ఇక్కడ పరిస్థితులను చూసి తల్లడిల్లిపోతున్నారు.
 
ఇంగ్లాండులో స్థరపడిన బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా భారతదేశంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు తమవంతు సాయం చేయాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. ఓ వీడియోను ట్వట్టర్లో పోస్ట్ చేసారు.
 
అందులో ఆమె మాట్లాడుతూ... నేను ఇప్పుడు లండన్ నగరంలో వున్నాను. నా స్నేహితుల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా భారతదేశంలో నెలకొన్న క్లిష్టమైన పరిస్థితులను తెలుసుకుంటూ వున్నాను. కోవిడ్ బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చికిత్సకోసం బాధితులు బెడ్లు కోసం పడిగాపులు కాస్తున్నారు. చనిపోయిన కరోనా వ్యక్తుల మృతదేహాలను సామూహికంగా దహనం చేస్తున్నారు. నా పుట్టిల్లు అయిన భారతదేశం రక్తమోడుతోంది. ఈ క్లిష్టమైన సమయంలో మనం భారతదేశానికి సాయం చేయాలి అంటూ చెప్పారు.