గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (13:48 IST)

దోమతో నరకయాతన.. డెంగ్యూ నుంచి కోలుకుంటున్న భూమీ

Bhumi
Bhumi
ప్రముఖ బాలీవుడ్ నటి భూమీ పడ్నేకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం డెంగ్యూ నుంచి ఆమె కోలుకుంటోంది. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. చాలా రోజుల తరువాత ఫ్రెష్‌గా ఫీలవుతున్నానంటూ పోస్ట్ పెట్టింది. 
 
డెంగీ దోమ తనను ఎనిమిది రోజుల పాటు నానా తంటాలు పెడుతోంది. కంటికి కనిపించని ఓ దోమ పరిస్థితిని బాగా దిగజార్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌పెట్టింది. తనకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలిపింది.
 
భూమి పడ్నేకర్, అర్జున్ కపూర్ కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ "ది లేడీ కిల్లర్" ఇటీవలే విడుదలై అభిమానులను అలరిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, అర్జున్ కపూర్‌తో కలిసి ఆమె నటిస్తున్న మరో చిత్రం కూడా నిర్మాణ దశలో ఉంది.