సునీల్ సరసన బాలీవుడ్ హీరోయిన్: ప్రచీ దేశాయ్తో రొమాన్స్
మర్యాద రామన్న హీరో సునీల్ సరసన పాపులర్ బాలీవుడ్ తార ప్రచీ దేశాయ్ నటించనుంది. కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ వంశీ ఆకెల్ల దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రచీ హీరోయిన్గా ఎంపికైందని టాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ప్రచీ దేశాయ్ ఏక్తా కపూర్ సూపర్ హిట్ హిందీ టీవీ సిరీస్లో నటించింది. ఇంకా మ్యూజికల్ డ్రామా రాక్ ఆన్, ఒన్స్ ఆపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, బోల్ బచ్చాన్, ఏక్ విలన్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రాక్ ఆన్ సీక్వెల్.. రాక్ ఆన్ 2లో నటిస్తోంది. ఈ మూవీ 2016లో రిలీజ్ కానుంది.