శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (12:54 IST)

పాక్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో రణబీర్... ఇద్దరూ ఇలా చిక్కారు....

రణబీర్ కపూర్ అనగానే దీపికా పదుకునె, కత్రినా కైఫ్ ప్రియుడిగా గుర్తు వచ్చేస్తుంది. ఇతగాడు ఆ ఇద్దరితో కావాల్సినన్న రోజులు ప్రేమాయణం సాగించి ఆ తర్వాత ఇద్దరికీ కట్ కొట్టేసి ఇప్పుడు పాకిస్తాన్ కు చెందిన ఓ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడనే టాక్ వినిప

రణబీర్ కపూర్ అనగానే దీపికా పదుకునె, కత్రినా కైఫ్ ప్రియుడిగా గుర్తు వచ్చేస్తుంది. ఇతగాడు ఆ ఇద్దరితో కావాల్సినన్న రోజులు ప్రేమాయణం సాగించి ఆ తర్వాత ఇద్దరికీ కట్ కొట్టేసి ఇప్పుడు పాకిస్తాన్ కు చెందిన ఓ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడనే టాక్ వినిపిస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఆమెతో కలిసి దమ్ము కొడుతూ కనిపించాడు రణబీర్. ఆ ఫోటో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. 
 
కాగా షారూక్ ఖాన్ రయీస్ చిత్రంతో మన ప్రేక్షకులకు దగ్గరైన మహిరా ఖాన్‌కు రణబీర్ అంటే మహా పిచ్చట. అతడి కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లిపోతుందట. తాజాగా ఇలా రణబీర్‌తో దమ్ము కొడుతూ కనబడింది. మరో విషయం ఏమిటంటే ఈ హీరోయిన్ ఇప్పటికే తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. పైగా ఓ బిడ్డ కూడా వుంది. మరి ఈ భామతో రణబీర్ ప్రేమలో మునిగి తేలుతుండటం చూస్తుంటే... అది కేవలం డేటింగ్ వరకేనా... లేదంటే పెళ్లి చేసుకుని ఆమెకు ఆధారంగా నిలబడతాడా... చూడాలి.