గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (15:44 IST)

కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాల డుం డుం డుం..

Kiara Advani
Kiara Advani
కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహం ఎట్టకేలకు ఈ వారాంతంలో జరగనుంది. వధువు శనివారం ఉదయం జైసల్మేర్‌కు బయలుదేరింది. శనివారం నుంచి ఈ జంట పెళ్లి రెండు రోజుల పాటు జరగనుంది. జైసల్మేర్‌లోని సూర్యగఢ్ హోటల్ వేదికగా జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో వారి ఇండస్ట్రీ మిత్రులు కొందరు చేరుతారు.
 
ముంబై విమానాశ్రయంలోని ప్రైవేట్ టెర్మినల్ నుండి కియారా జైసల్మేర్‌కు బయలుదేరిన దృశ్యాలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెల్లటి కో-ఆర్డ్ సెట్‌లో మెరిశాడు. కియారా వీడియో అభిమానులను ఉత్తేజపరిచింది. 
 
శుక్రవారం, ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్డా కూడా రాజస్థాన్‌కు విమానంలో బయల్దేరింది. ఆమె విమానాశ్రయం నుండి తన ఫోటోను షేర్ చేసింది. కియారా-సిద్ధార్థ్ వివాహం కోసం జైసల్మేర్‌లో 83 గదులు ఏర్పాటు చేశారు. ఇంకా అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు.