సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (21:59 IST)

త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న చెర్రీ హీరోయిన్

Kiara Advani
బాలీవుడ్ సుందరి కియారా అద్వానీ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం ఫిబ్రవరి ఆరో తేదీన జరుగనుంది. షేర్షా' సినిమాలో వీరిద్దరూ తొలిసారి నటించారు. అనంతరం ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
 
ఇందులో భాగంగా ఈ నెల 4, 5 తేదీల్లో వివాహానికి సంబంధించిన హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. రాజస్థాన్ జైసల్మేర్ లోని ప్యాలెస్‌‌లోని పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరుగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు పూర్తయ్యాయి. 
 
ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొందరు ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం. రాజస్థానీ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరుగుతుంది. ఢిల్లీ, ముంబైలలో వివాహ రిసెప్షన్లు జరుగుతాయి.