గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (09:19 IST)

రామ్‌చరణ్‌ సినిమా తాజా అప్ డేట్, 15కోట్లతో సాంగ్‌ చిత్రీకరణ!

Ram Charan, Kiara Advani
Ram Charan, Kiara Advani
సినిమాలకు సెట్లు వేయడం మామూలే. దానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటారు. అందులోనూ అగ్రహీరోల సినిమాలకు బడ్జెట్‌ పరిమితి వుండదు. ముందుగా అనుకున్న బడ్జెట్‌ను డబుల్‌ చేసిన సందర్భాలు చాలానే వున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం రాజమౌళి. తన సినిమాలకోసం ఎంతైనా నిర్మాతలను ఖర్చుపెట్టించడానికి సిద్ధమవుతాడు. నిర్మాతలు కూడా అందుకు ముందుంటారు. ఇప్పుడు ఆ కోవలో తమిళ దర్శకుడు శంకర్‌ చేరారు. ఆయన తన సినిమాలకోసం చాలా ఖర్చు పెట్టిస్తుంటారు. రోబోలో ఓ సాంగ్‌ కోసం కోట్ల రూపాయలు కుమ్మరించాల్సివచ్చింది. ఇక గ్రాఫిక్స్‌ అయినా హెలికాప్టర్లు, ల్యాబ్‌ సెట్టింగ్‌కు చాలానే అయ్యాయి. 
 
ఇప్పుడు తాజాగా శంకర్‌ దర్శకత్వంలో ఆర్‌.సి. 15 సినిమా రూపొందుతోంది. ఇందులో ఓ పాట కోసం దాదాపు 15కోట్లు పెడుతున్నట్లు చిత్రయూనిట్‌ చెబుతోంది. పాన్‌ ఇండియా ఫిలింగ్‌ గా  రూపొందుతోన్న ఈ సినిమాలోని ఆ సాంగ్‌ను నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 2వరకు చిత్రీకరించనున్నారు. 12 రోజుల షూటింగ్ & కేవలం ఒక పాట కోసం 15 కోట్ల బడ్జెట్ నిజంగా పెద్దది.
 
రామ్ చరణ్, కియారా అద్వానీ తో బాటు భారీ తారాగణం నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గురించి అప్‌డేట్స్‌ రానున్నాయి. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు.