శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (16:59 IST)

హత్య కేసులో ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ భార్య వద్ద విచారణ!

nelson wife
కోలీవుడ్ చిత్ర‌సీమ‌కు అనుకోని షాక్ త‌గిలింది. కొన్నాళ్లు ముందు బాహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్మ్ స్ట్రాంగ్‌ను కొంత మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్త‌లు దారుణంగా చంపేశారు. ఆయ‌న ఒక లాయ‌ర్ కూడా. ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు విచార‌ణ‌ను వేగ‌వంతం చేశారు. 23 మంది నిందితులను అరెస్టు చేయగా, ఒక నిందితుడు మాత్రం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. 
 
పోలీసులు అనుమానితుల్లో ఒక‌రైన‌ మొట్టై కృష్ణ‌న్ అనే నేర‌స్తుడు మాత్రం విదేశాల‌కు పారిపోయాడ‌ని స‌మాచారం. అయితే ఇక్క‌డ అస‌లైన ట్విస్ట్ ఏంటంటే స‌ద‌రు మొట్టై కృష్ణ‌న్ పారిపోవ‌టానికి కొన్ని గంట‌ల ముందు నెల్స‌న్ దిలీప్ కుమార్ స‌తీమ‌ణి మోనీషాతో ఫోన్‌లో మాట్లాడార‌ని, ఆమె ఆయ‌న‌కు ఆశ్ర‌యం కూడా ఇచ్చార‌నే విష‌యం పోలీసుల‌కు విచార‌ణ‌లో తెలిసింది. 
 
దీంతో పోలీసులు నెల్స‌న్ స‌తీమ‌ణి మోనీషాను విచారించారు. అవ‌స‌రం అయితే ద‌ర్శ‌కుడు నెల్స‌న్‌ను కూడా విచారించే అవ‌కాశాలున్నాయని వార్త‌లు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడిగా రాణించే స‌మ‌యంలో నెల్స‌న్ స‌తీమ‌ణి ఇలా హ‌త్య కేసులో ముద్దాయికి ఆశ్ర‌యం ఇచ్చే నేరంలో పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావ‌టం అనేది హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి దీనిపై ఇప్ప‌టివ‌ర‌కు నెల్స‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు.