మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (14:30 IST)

బిగ్‌బాస్ సీజన్ 5.. హోస్ట్‌గా రానా?

రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 త్వరలోనే ప్రారంభం కానుందనే వార్తలు కొన్నిరోజులు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు బిగ్‌బాస్ 5 వ్యాఖ్యాత మారబోతున్నారు. బిగ్‌బాస్ సీజన్ 1ని ఎన్టీఆర్‌, సీజన్ 2ని నాని హోస్ట్ చేయగా సీజన్‌3, సీజన్ 4లను నాగార్జున హోస్ట్ చేశారు. 
 
అయితే బిజీ షెడ్యూల్ కారణంగా నాగ్ ఈసారి అందుబాటులో ఉండకపోవచ్చని అందువల్ల ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ప్రారంభించాలనుకునే ఈ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా రానా దగ్గుబాటిని ఒప్పించడానికి నిర్వాహకులు సంప్రదింపులు జరుపుకుతున్నారని టాక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
 
అక్కినేని నాగార్జున బిగ్ బాస్ 5 కోసం డేట్స్ కేటాయించడం కష్టంగా మారిపోయింది. అందుకే ఈ ఒక్క సీజన్‌కు ఈయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని నిర్వాహకులకు చెప్పి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఉన్నట్లుండి నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా షాకయ్యారట. ఈ స్థానంలో రానా దగ్గుబాటిని తీసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 
 
బుల్లితెరపై రానాకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నెం 1 యారీతో ఇప్పటికే రికార్డులు సృష్టించాడు రానా. దాంతో పాటు హోస్టుగానూ మంచి అనుభవం ఉంది. అందుకే రానా అయితే బిగ్ బాస్ 5 తెలుగును బాగా లీడ్ చేస్తాడని నిర్వాహకులు కూడా నమ్ముతున్నారు. దీనికోసం స్టార్ మా ఈ హీరోకు భారీ మొత్తమే చెల్లించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని పై బిగ్ బాస్ అధికారులు అఫిషియల్ గా ప్రకటిస్తే గానీ హోస్ట్ పై క్లారిటీ వస్తుంది.