శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 17 మార్చి 2020 (21:06 IST)

ఆ పనికి నేను న్యాయం చేశానా లేదా అనేది ముఖ్యమంటున్న కేథరిన్

తన అందాలతో అభిమానులకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది కేథరిన్. చేసిన సినిమాలు తక్కువే అయినా కేథరిన్ అంటే పడిచచ్చే అభిమానులు చాలామందే ఉన్నారు. కేథరిన్ ఈమధ్య నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయే సరికి వేదాంతం చెప్పడం ప్రారంభించింది.
 
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన స్మిత పాత్రలో నటించింది కేథరిన్. ఆ క్యారెక్టర్ కాస్త కేథరిన్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. తన జీవితానికి తనకిచ్చిన క్యారెక్టర్‌కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని.. తాను కూడా స్మితలాగే ఉంటానని చెబుతోంది కేథరిన్.
 
నేను ఒక సినిమాలో ఒక హీరోయిన్‌గా ఉంటానా.. లేకుంటే ఇద్దరు ఉన్నారా.. ముగ్గురు ఉన్నారా... ఎంతమంది ఉంటారన్నది పట్టించుకోను. నాకు కావాల్సింది ఆ సినిమాలో నా క్యారెక్టర్‌కు నేను న్యాయం చేశానా లేదా అన్నది ముఖ్యం. నేను ఎప్పుడూ అదే ఆలోచిస్తుంటాను. మిగిలిన విషయాలను అస్సలు పట్టించుకోనంటోంది కేథరిన్.