శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 14 మార్చి 2020 (22:04 IST)

నేను అక్కడికి రానని దర్సకనిర్మాతలను పంపేస్తున్న కియారా, ఎక్కడికి?

మహేష్ బాబు సరసన నటించిన కియారాకు తెలుగు సినీ పరిశ్రమలో అభిమానులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఈ భామ తెలుగులోనే బాగా సినిమాలు చేస్తోంది. అయితే దక్షిణాదిన సినిమాలు చేయడానికి రానని చెబుతోందట కైరా. ఉత్తరాదిన మాత్రమే సినిమా చేస్తానని చెబుతోందట.
 
దక్షిణాదిన కైరా రెండు సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్‌కి వచ్చినంత పేరూ క్రేజ్ సంపాదించుకుంది. ఆమెతో సినిమా చేయడానికి దక్షిణాది స్టార్ హీరోలు ముచ్చటపడుతుంటే కైరా మాత్రం ఇక్కడ డేట్లు అడ్జెస్ట్ చేయలేనంటోందట. తనకి కూడా దక్షిణాదిన యేడాదికి ఒక సినిమా అయినా చేయాలని ఉందట. 
 
కానీ ఉత్తరాదిన ఒప్పుకున్న సినిమాలు, వీటితో పాటు వెబ్ సిరీస్ కూడా ఆమెను నటింపచేయాలని అనుకున్నా కైరా తన వల్ల కాదని చెప్పేసిందట. కొందరు దర్శకనిర్మాతలు ఆమె కోసం ఆగాలని అనుకున్నా వారికి కూడా వద్దని చెప్పేసిందట. నా కోసం మీ టైం వేస్ట్ చేసుకోకండి అంటూ మర్యాదగా వారిని తిప్పి పంపుతోందట. కైరా వ్యవహారం చూస్తుంటే ఈ యేడాది కూడా ఆమె దక్షిణాదిన సినిమా చేసే అవకాశం లేనట్లే అంటున్నారు సినీవర్గాలు.