శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (21:40 IST)

దిశ ఎన్‌కౌంటర్: రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చిన సెన్సార్

Disha Encounter
ఎప్పుడూ వివాదాస్పద సినిమాలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. దిశ ఉదంతం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనకు తెలుసు. దీనిపై 'దిశ ఎన్‌కౌంటర్ ' పేరుతో సినిమాను రూపొందించనున్నట్లు ఆర్జీవీ తెలియజేశారు. 
 
అన్నట్లుగానే రామ్‌గోపాల్ వర్మ దిశ ఎన్‌కౌంటర్ సినిమాను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్స్‌, ట్రైలర్‌ను విడుదల చేసి ఈ నెల 19న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సినిమాపై దిశ కుటుంబ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 
 
దిశ ఎన్‌కౌంటర్ సినిమాను వీక్షించిన నలుగురు సభ్యులున్న సెన్సార్ బోర్డు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో సినిమా ఇప్పుడు రివైజింగ్ కమిటీ చూడనుంది. దీన్ని ఎనిమిది మంది సభ్యులున్న రివైజింగ్ కమిటీ చూసి ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 
 
ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్‌, సోనియా, ప్రవీణ్‌ రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 19న సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావించిన తరుణంలో సెన్సార్ సభ్యుల నుంచి అవాతరం ఏర్పడింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన దిశ ఘటనపై దేశం యావత్తు విస్తుపోయింది. పోలీసులు నేరస్థులను పట్టుకుని ఎన్‌కౌంటర్ కూడా చేశారు.