యాక్ష‌న్ మూవీలో విశాల్ హీరోనా..? విల‌నా..?

శ్రీ| Last Updated: శుక్రవారం, 15 నవంబరు 2019 (15:33 IST)
విశాల్- త‌మ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం యాక్ష‌న్. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ నవంబర్ 15న విడుదల అయ్యింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా నిన్న రాత్రి రిలీజ్ చేసిన ఈ సినిమా సరికొత్త పోస్టర్ సిని ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచింది. ఆ పోస్ట‌ర్‌లో విశాల్ ఒక తీవ్రవాది గెటప్ లో ఉండి, చేతికి సంకెళ్లు చుట్టూ జవాన్లు పట్టుకొని విశాల్‌ను తీసుకొస్తున్నారు.

ఆ లుక్‌ని చూసిన నెటిజన్లు ఇంతకి ఈ సినిమాలో విశాల్ హీరోనా, విలనా రెండూ కాకా డబుల్ రోల్ ఏమైనా ప్లే చేస్తున్నాడా అనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విశాల్, తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ, తదితరులు నటించిన ఈ సినిమాకు సుందర్. సి దర్శకత్వం వహించారు.

శ్రీ కార్తికేయ సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్‌ ఆడెపు (వరంగల్ శ్రీను) నిర్మించారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో ఈ మూవీ పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌రి.. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :