శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (14:34 IST)

#AsheyMaaDurgaShey (వీడియో)-సోషల్ మీడియాలో వైరల్.. ఎంపీలు అదుర్స్

ప్రముఖ బెంగాలీ సినీ నటులు, ఎంపీలు నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తితో ప్రత్యేక పాటను రూపొందించారు. శరన్నవరాత్రులు రానుండటంతో  ఉత్సవాల్లో భాగంగా ఓ ప్రత్యేక పాటను రూపొందించి బెంగాలీ ఎంపీలు అందులో నటించనూ చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటి షేక్ చేస్తోంది. దుర్గామాతను కొలుస్తూ బెంగాలీ భాషలో రూపొందించిన 'ఆశే మా దుర్గా శే' పాటకు ఎంపీలు నుస్రత్ జహాన్, మిమీ చకవ్రర్తి నృత్యం చేశారు. 
 
బెంగాలీ నటి సుభశ్రీ గంగూలీ కూడా నుస్రత్, మిమీలతో కలిసి ఈ వీడియో సాంగ్‌లో కనిపించింది. దుర్గామాత పూజా సాంగ్-2019 పేరుతో కెప్టెన్ టీఎంటీ ఈ పాటను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేశారు. సోమవారం సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోను .6 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోకు లైకులు, షేర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.