గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (18:11 IST)

చేగువేరా కూతురు డా. అలైదా గువేరా ఆవిష్కరించిన చే మూవీ పోస్టర్

Dr. Alaida Guevara  with che team
Dr. Alaida Guevara with che team
తెలుగు తెరపై మరో బయోపిక్ రాబోతుంది. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం "చే" లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. క్యూబా  తరువాత ప్రపంచం లో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బియోపిక్ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.

సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో  లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్  కీలకపాత్రలు పోషిస్తున్నారు.  రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ పోస్టర్ ను  చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా లాంచ్ చేసి చిత్రయూనిట్ ను అభినందించారు.
 
అనంతరం హీరో , దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ,  "విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు  ఈ చిత్రంలో తీశాము. అప్పటి  పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను రూపోందించాం" అని చెప్పారు. "ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చేయ్యడం అదృష్టంగా భావిస్తున్నాం.  పోస్ట్ ప్రోడక్షన్ పూర్తికాగానే...త్వరలో సినిమా టీజర్ ,ట్రైలర్ రిలీజ్  చేసి విడుదల తేదిని అనౌన్స్ చేస్తాం" అని తెలిపారు..
 
నటీనటులు లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్  నాయక్...నిర్మాతలు  : సూర్య , బాబు , దేవేంద్ర కో డైరెక్టర్ : నాని బాబు రచయిత, దర్శకుడు : బి.ఆర్ సభావత్ నాయక్,  బ్యానర్  : నేచర్ ఆర్ట్స్, డి.ఓ.పి : జగదీష్, ఎడిటర్ : శివ శర్వాణి, సంగీత దర్శకుడు : రవిశంకర్, పి.ఆర్.  : దయ్యాల అశోక్