మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (13:19 IST)

ప్రియుడితో చక్కర్లు కొట్టిన నిర్మాత కుమార్తె... కరోనాతో స్వదేశానికి..

కరోనా వైరస్‌కు చిన్నాపెద్దా తేడాలేదు. ఏమాత్రం అజాగ్రత్తగా వుంటేచాలు ఈ వైరస్ కాటేస్తోంది. తాజాగా బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ఓ బడా నిర్మాత కుమార్తెకు ఈ వైరస్ సోకింది. దీనికి కారణంగా కరోనా వైరస్‌ను ఏమాత్రం లెక్క చేయకుండా తన ప్రియుడితో కలిసి అడ్డూఅదుపు లేకుండా తిరిగింది. దీంతో ఆమెను కరోనా కాటేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాలీవుడ్ బడా నిర్మాత కరీం మొరానీ. ఈయన కుమార్తె షాజూ మొరానీ. ఆమెకు ప్రియాంక్ శర్మ అనే ప్రియుడు ఉన్నాడు. ఇటీవల తన ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిన ఈ అమ్మడు.. అక్కడ అడ్డూఅదుపు లేకుండా ఇష్టానుసారంగా తిరిగింది. 
 
ఆ తర్వాత ఇటీవలే ఆమె ముంబైకు చేరుకుంది. ఇక్కడకు వచ్చిన తర్వాత జ్వరం, దగ్గు, జలుబు రావడంతోపాటు శ్వాసపీల్చడంలో అసౌకర్యంగా ఉండటంతో ఆస్పత్రికెళ్లి కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
దీంతో ఆమె కుటుంబ స‌భ్యుల‌ని కూడా క్వారంటైన్‌కి త‌ర‌లించారు. ఇప్పుడు షాజాకి క‌రోనా సోకినట్టు తేలడంతో ప్రియాంక్‌కి కూడా క‌రోనా టెస్ట్‌లు చేయాల‌ని అధికారులు భావిస్తున్నారు.