ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 19 జులై 2019 (12:52 IST)

రోడ్డు ప్రమాదంలో బాలనటుడు దుర్మరణం!

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దారుణమైన ఆ ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నో రకాల భద్రతా చర్యలను చేపడుతూ, అమలు చేస్తున్నప్పటికీ... ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య పెరుగుతుండటమేకాకుండా ప్రభుత్వాలపై ఆర్థిక భారం కూడా ప్రభుత్వాలపై పడుతోంది. రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబ సభ్యల వేదనను ఎవరూ తీర్చలేకపోతున్నారు. 
 
తాజాగా రోడ్డు ప్రమాదంలో బాలనటుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఛత్తీస్‌గడ్‌ రాయ్‌పూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో  హిందీ టీవీ సీరియళ్లలో నటించిన పాపులర్ అయిన శివలేఖ్ సింగ్ ‌(14) దుర్మరణం పాలయ్యారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.
 
రాయ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ ఆరిఫ్ షేక్ అందించిన వివరాల ప్రకారం... ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే మరణించగా, అతని తల్లి లేఖ్నా సింగ్‌, తండ్రి శివేంద్రసింగ్‌‍తో పాటు మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యారు. అయితే తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కారులో బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.