శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (11:21 IST)

రాధారవికి క్షమాపణలు చెప్పాలా? నో ఛాన్స్.. చిన్మయి శ్రీపాద

తాను గతంలో చేసిన విమర్శలకు కట్టుబడే వున్నానని ప్రముఖ గాయని చిన్మయి తెలిపింది. తాను క్షమాపణలు చెబితే, డబ్బింగ్ కళాకారుల సంఘంలో తిరిగి చేర్చుకుంటానని రాధారవి వ్యాఖ్యానించిన నేపథ్యంలో చిన్మయి ఘాటుగా స్పందించారు. ఆయనకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. తాను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. 
 
కాగా, కోలీవుడ్ డబ్బింగ్ కళాకారుల సంఘానికి జరిగిన ఎన్నికల్లో చైర్మన్ పదవికి చిన్మయి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురికాగా, పోటీలో ఉన్న రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ప్రముఖ రచయిత వైరముత్తుపై వేధింపుల ఆరోపణలు చేసిన చిన్మయి.. వారం క్రితం గాయకుడు మనోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 
 
ఇరవై ఏళ్ల క్రితం ప్రముఖ లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించాడని ఏడాదిన్నర క్రితం షాకింగ్ ఆరోపణలు చేసారు. కానీ ఆమెకు న్యాయం జరగకపోగా నష్టం జరిగింది. వైరాముత్తు పలుకుబడి ఉన్నవాడు కావడంతో చిన్మయిని డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించేసారు. పోలీసులకు చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఫిర్యాదు చేసి ఏడాదిన్నర కావొస్తున్నా వైరముత్తు దర్జాగా తిరుగుతున్నాడు.
 
ఈ నేపథ్యంలో చిన్మయి ప్రముఖ గాయకుడు మనో గురించి షాకింగ్ విషయం బయటపెట్టారు. కార్తిక్ తమను లైంగికంగా వేధించాడని ఎందరో ఆడవాళ్లు ఆరోపణలు చేయడంతో వారితో కలిసి మాట్లాడాలని ఓసారి ఇంటికి తీసుకుని రావాలని మనో చిన్మయిని కోరారట. పోనీ మనో గారైనా న్యాయం జరిగేలా చూస్తారనుకుంటే.. రాజీకి రావాలని అన్నారట. ఈ విషయాన్ని తాజాగా చిన్మయి సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు.