గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (13:24 IST)

2024 ఎన్నికల్లో చిరంజీవి కీలక పాత్ర.. జనసేన తరపున ప్రచారం?

రాజకీయాలకు దూరంగా వున్న మెగాస్టార్ చిరంజీవి 2024 ఎన్నికల్లో కీలక భూమిక పోషించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
 
2024 ఎన్నికల్లో చిరంజీవి తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రధానంగా కాపు సామాజిక వర్గ పెద్దలు ఈ విషయమై చిరంజీవి మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారట.
 
రాజ్యాధికారమే లక్ష్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్దతివ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  
 
"చిరంజీవి గనుక జనసేనకు బాహాటంగా మద్దతు తెలిపితే, జనసేన తరఫున ప్రచారం చేస్తే.. మేం కూడా జనసేన వెంట నడుస్తాం.." అంటూ వివిధ పార్టీలో వున్న కొందరు కాపు నేతలు, కాపు సామాజిక వర్గ పెద్దలకు చెప్పారంటున్నారు. ఈ విషయమై ఇంకా చిరంజీవి ఓ నిర్ణయం తీసుకోవాల్సి వుంది.
 
కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలే కాకుండా, ఇతర సామాజిక వర్గాలకు చెందిన పెద్దలు కూడా ఈసారి జనసేన వైపు చూస్తున్నారంటూ ఓ ప్రచారమైతే తెరపైకొచ్చింది.