న్యూ లుక్‌తో 'గుండు' చిరు .. షేక్ చేస్తున్న 'బిగ్ బాస్'
కరోనా లాక్డౌన్ కారణంగా గత ఆర్నెల్లుగా సినీ సెలెబ్రిటీలంతా తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ గ్యాప్‌లో కొందరు కరోనాపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు రక్తదానం, ప్లాస్మాదానం, ఇంకొందరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇలా బిజీగా ఉన్నవారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఆయన లాక్డౌన్ సమయంలో డిఫరెంట్ లుక్‌తో కనిపించి, అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు.
తాజాగా మరో అదిరిపోయే లుక్‌తో కనిపించిన ఈ బిగ్ బాస్.. ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ లుక్‌లో చిరంజీవి నున్నటి గుండుతో కనిపిస్తున్నారు. ఈ ఫోటోను చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే, చిరుగడ్డం, చిరుమీసంతో నల్ల కళ్లజోడు ధరించి చిరంజీవి డిఫరెంట్ లుక్‌లో ఉన్నారు.
ఇక ఆ ఫోటో కింది.. 'నేను సన్యాసిలా ఆలోచించగలనా?' అనే క్యాప్షన్‌ను కూడా చిరు జతచేశారు. ఇంతకు మించి ఫొటో గురించి ఆయన వివరాలను వెల్లడించలేదు. ఇది నిజమైన గుండేనా? లేక ఫ్యూచర్ ప్రాజెక్ట్ కోసం ఏదైనా ఫొటో షూట్ చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది.