గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:59 IST)

ఆసుప‌త్రిలో చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్

Kalyan dev, letter
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ ప్ర‌స్తుతం ఆసుప్ర‌తిలో జేరారు. కోవిడ్ బారిన ఆయ‌న ప‌డ్డారు. ఇటీవ‌లే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కోవిడ్ పాజిటివ్ నుంచి నెగెటివ్‌కు వ‌చ్చారు. కాగా,  చిరంజీవి కుమార్తె శ్రీ‌జ భ‌ర్త క‌ళ్యాణ్‌దేవ్‌కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో నిన్న పరీక్షలు చేయించుకోగా, తనకు కరోనా పాజిటివ్‌ అని తేలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాన్నట్లు చెప్పారు.

త్వరలోనే కోలుకుంటానని, ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక నాగబాబు సైతం కల్యాణ్‌దేవ్‌ పోస్ట్‌పై స్పందించారు. త్వరగా కోలుకుంటావనే నమ్మకం, గెట్‌ వెల్‌ సూన్‌ మై బాయ్‌ అంటూ కామెంట్‌ చేశారు. తాజాగా ఆయ‌న ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఆ సినిమా హీరోయిన్ అవికా గౌర్‌ సహా చిత్ర యూనిట్ ఆయ‌న త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు చేశారు.