కొణిదెల లేడిస్‌తో మెగాస్టార్.. సోషల్ మీడియాలో ఫోటోకు యమాక్రేజ్
కొణిదెల లేడిస్.. అదేనండి.. మెగాస్టార్ తన పెద్దకూతురు, చిన్నకూతురు శ్రీజ, కోడలు ఉపాసనతో కలిసి తీయించుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్‌గా పేరు కొట్టేసినా.. చిరంజీవి కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో తన చిన్న కూతురు శ్రీజకు మళ్లీ పెళ్లి చేయబోతున్న నేపథ్యంలో దగ్గరుంచి అన్ని పనులూ చూసుకుంటున్నారు చిరంజీవి.
ఈ సందర్భంగా శ్రీజతో పాటు తన పెద్ద కూతురు సురేఖ కోడలు ఉపాసనలతో కలిసి ఆయన దిగిన ఫొటో సోషల్ మీడియాల హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో చిరంజీవి లుక్ అదిరిపోయింది. చిరంజీవి కత్తి రీమేక్ కోసం.. తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే చిరు సరికొత్తగా దర్శనమిస్తున్నాడు. అటు ఇటుగా ఇంకో నెల రోజుల్లో ‘కత్తి’ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లొచ్చని సమాచారం. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేయబోతుండటం విశేషం. చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా ‘కత్తి’ని మరింత పదునెక్కించేదుకు వి.వి.వినాయక్ రెడీ అవుతున్నారు.