శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:13 IST)

మెగాస్టార్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను మెగాస్టార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరకడంతో చిరంజీవి శ్రీమతితో కలిసి జపాన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. చిరంజీవి జపాన్ నుంచి తిరిగిరాగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి. 
 
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తరపున మెగాస్టార్ ప్రచారం చేయబోతున్నారని వస్తున్న వార్తలపై మెగా కుటుంబం స్పందించింది. 2019లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మెగాస్టార్ ఏ పార్టీ తరపున ప్రచారం చేయడం లేదని, ఎన్నికల ప్రచారానికి చిరంజీవి దూరంగా ఉంటారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.