గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (10:04 IST)

అరడజన్ ఫ్లాపుల హీరోకు అద్భుతమైన బిజినెస్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి ఇప్పటికీ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు సాయిధరమ్ తేజ. వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ కావడంతో సాయి ధరమ్ సినిమాలకు డిమాండ్ బాగా తగ్గిపోతుందనే భావించారు. ఫ్లాప్‌ల కారణంగా అతనికి అవకాశాలు కూడా రావనే అనుకున్నారు, అయితే మెగా ఫ్యామిలీ నుంచి రావడమో లేకుంటే తన సొంత ఇమేజ్ వల్లనో ఇంకా ఆఫర్లు అయితే వస్తున్నాయి. 
 
తాజాగా సాయి ధరమ్ నటిస్తున్న చిత్రం చిత్రలహరి ఏప్రిల్ 12న విడుదల కాబోతోంది. ఈమధ్యనే టీజర్ కూడా విడుదల చేసారు. అస్సలు అంచనాలు లేకుండా ఉన్న ఈ సినిమాపై టీజర్ విడుదలై పాజిటివ్ టాక్ రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. 
 
సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు ఉన్నప్పుడే బిజినెస్ బాగా జరిగిందని సమాచారం. శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ హక్కులు అన్నీ కలుపుకుని 25 కోట్లకు అమ్ముడుపోయిందని సమాచారం. అరడజన్ ఫ్లాపుల తర్వాత కూడా ఇంత బిజినెస్ జరగడం అద్భుతమనే చెప్తున్నారు విశ్లేషకులు.