గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 14 మే 2024 (14:56 IST)

అన్న చెల్లెలి అనుబంధంతో చిట్టి పొట్టి చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

Ram mittaKanti ,Pavithra (Brother and sister)
Ram mittaKanti ,Pavithra (Brother and sister)
భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా ... ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం.  ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది.
 
చిట్టి పొట్టి టైటిల్ ,మోషన్ పోస్టర్ కు చక్కటి ఆదరణ లభించింది, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి తెలిపారు.
 
నటీనటులు: రామ్ మిట్టకంటి , పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ
 సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి సంగీతం: శ్రీ వెంకట్  ఎడిటర్: బాలకృష్ణ బోయ కెమెరా: మల్హర్బట్ జోషిపిఆర్ఓ: లక్ష్మి నివాస్ , దయ్యాల అశోక్