గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (19:20 IST)

నేడు ఆంధ్రప్రదేశ్‌లో షూటింగులు బంద్ - సినిమా హాళ్ల మూసివేత

theaters
సూపర్ స్టార్ కృష్ణ మృతిపై తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఓ కీలక ప్రకటన చేసింది. కృష్ణ మృతికి సంతాపంగా బుధవారం విజయవాడ నగర పరిధిలోని అన్ని సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. సినీ అభిమానులు ఇందుకు సహకరించాలని కోరింది. విజయవాడతో కృష్ణకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చాంబర్ తన ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదిలావుంటే, కృష్ణ మృతికి సంతాపంగా బుధవారం సినిమా షూటింగులను నిలిపివేస్తున్నట్టు ఇప్పటికే తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. కృష్ణ మృతికి సంతాపంగా రేపు సినీ పరిశ్రమ కార్యకలాపాలు, షూటింగులు రద్దు చేసుకోవాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన విజ్ఞప్తి మేరకే నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది.