ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (12:48 IST)

కమేడియన్ జోగినాయుడుకి రెండో పెళ్లి.. అన్నవరంలో సంప్రదాయంగా..

ప్రముఖ యాంకర్, సినీ కమేడియన్ జోగినాయుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. అన్నవరంలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో, తన స్వగ్రామమైన విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన సౌజన్యను సంప్రదాయబద్

ప్రముఖ యాంకర్, సినీ కమేడియన్ జోగినాయుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. అన్నవరంలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో, తన స్వగ్రామమైన విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన సౌజన్యను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు. 
 
తెలుగు సినీ రంగంలో రాణిస్తున్న జోగినాయుడు, గతంలో ప్రముఖ యాంకర్ ఝాన్సీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. మరోసారి పెళ్లి పీటలు ఎక్కిన జోగినాయుడికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
 
ఇక వ్యక్తిగత జీవితంలో విభేదాలు తలెత్తడంతో ఝాన్సీ, జోగినాయుడు 2014లో విడిపోయారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కుమార్తె జాన్సీ వద్దనే ఉంది. విభేదాలు ముదరకుండా ఎవరి జీవితం వారు గడపాలని అప్పట్లో విడిపోయినట్లు జోగినాయుడు గతంలో చెప్పాడు. 
 
జోగినాయుడు సుకుమార్ చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటాడు. కార్తికేయ, స్వామిరారా ఇలా పలు చిత్రాలలో జోగినాయుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రంగస్థలం చిత్రంలో కూడా జోగినాయుడు జగపతి బాబుకు సేవలు చేసే వ్యక్తిగా నటించిన సంగతి తెలిసిందే.