గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (18:41 IST)

ప్ర‌కాష్‌రాజ్ పేన‌ల్‌లో పోటీదారులు- డ్రెగ్‌కు వ్య‌తిరేకిని- క‌ళ్యాణి ఆరోప‌ణ‌లు నిజంకాదు

Prakash Raj
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ప్ర‌కాష్‌రాజ్‌కు పోటీగా జీవితా రాజ‌శేఖ‌ర్‌, హేమ‌, జ‌య‌సుధ పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. క‌ట్‌చేస్తే, వారంతా ప్ర‌కాష్‌రాజ్ పేన‌ల్‌లో చేరిపోయారు. తెర‌వెనుక ఏం జ‌రిగింద‌నేది ఊహించుకోవ‌చ్చు.
వారంద‌రినీ ఒకే తాటిపై తీసుకువ‌చ్చేందుకు ప్ర‌కాష్‌రాజ్ కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇందుకు సినీపెద్ద‌లు ప్ర‌మేయం ఉంద‌నేది తెలుస్తోంది. ఇంకా 20రోజుల్లో ఎల‌క్ష‌న్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్‌రాజ్ అధ్యక్ష‌త‌న సినిమా బిడ్డ‌ల పాన‌ల్‌ను శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.
 
ప్ర‌కాష్ రాజ్ ఓటేవేయ‌డానికి రాడు. ఆయ‌న వ‌ల్ల మాన‌సిక‌క్షోభ అనుభ‌వించాను అంటూ క‌రాటే క‌ళ్యాణి విమ‌ర్శించారు. దీనిపై మీ స‌మాధానం?
నేను 7,8 సార్లు మా స‌భ్యుడిగా ఓటు వేశాను. నాగార్జున‌, ముర‌ళీమోహ‌న్ పోటీచేసిన‌ప్పుడు వేశాను. మిగిలిన సంవ‌త్స‌రాల్లో నాకు కుద‌ర‌లేదు. ఇక ఆమె నాపై క‌ళ్యాణిగారు చేసిన విమ‌ర్శ‌లు ఏమిట‌నేది క్లియ‌ర్‌గా ఆమె చెబితే నేను స‌మాధానం ఇస్తాను. ప్ర‌స్తుతం ఆమె నాపై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్తవం. నేను ఖండిస్తున్నాను.
 
నిర్మాత‌లు చాలామంది మీ డేట్స్ వ‌ల్ల స‌ఫ‌ర్ అయ్యారు. ఎక్కువ డ‌బ్బ‌లు తీసుకుంటున్నార‌ని, మిమ్మ‌ల్ని బేన్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి క‌దా?
నేను 25 ఏళ్ళ‌నుంచి సినిమాల్లో వున్నాను. నిర్మాత‌లే సినిమాలు తీస్తున్నారు. నాపై అప‌వాదులుంటే వారు ఎందుకు తీస్తారు. వారు చెప్పింది న‌మ్మిన‌ప్పుడు నేను చెప్పింది న‌మ్మాలిగ‌దా. ఆర్టిస్టుగా డేట్స్ అడుగుతారు. ఇస్తాను. త‌ర్వాత కొన్నిసార్లు కుద‌ర‌క‌పోతే చేయ‌లేన‌ని చెబుతాను. క‌ళాకారుడిగా కొన్ని స‌మ‌స్య‌లుంటాయి. ఆ కోణంలో మీరు ఆలోచించాలి. నేను ఎక్కువ డ‌బ్బులు తీసుకుంటున్నాన‌ని చెబుతున్నారు. అస‌లు డ‌బ్బ‌లు లేకుండా చేసిన సినిమాలు వున్నాయి. వాటి గురించి ఏమంటారు.
 
నైట్ పార్టీలు చేసుకోవ‌డంవ‌ల్ల మా స‌భ్యుల్లో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి? 
క‌ళాకారుల‌కు నైట్ పార్టీలు స‌హ‌జ‌మే. వృత్తిప‌రంగా వారి వారి విష‌యాలు చ‌ర్చించుకునేందుకు ఓ అవ‌కాశం లాంటిది. ఒక‌రితో ఒక‌రు రిలేష‌న్ పెంపొందించుకునేందుకు భోజ‌నాలు చేస్తారు. మందు తాగుతారు. దానిలో అభ్యంత‌రం ఏముంటుంది.
 
`మా మ‌స‌బారింది. న‌రేశ్ అధ్య‌క్షుడిగా స‌రైన లెక్క‌లులేవ‌ని నాగ‌బాబు అన్నారు? ఈ విష‌యంలో మీరెలా చూస్తారు?
అది నేను అన్న మాట కాదు. నేను చెప్ప‌లేదు. మీ మీద ఒట్టు. నా మీద ఒట్టు. గ‌తంలో ఏం జ‌రిగింది అనేది తెలీదు. నేను కేవ‌లం మెంబ‌ర్ మాత్ర‌మే. కొన్ని విష‌యాలు చెప్ప‌లేనివి, చెప్పాల్సిన‌వి వుంటాయి. .నాగ‌బాబు ప్ర‌శ్నించారు. న‌రేశ్ స‌మాధానం ఇచ్చారు. అప్ప‌ట్లో నేను ఏ పేన‌ల్‌లో లేను. కేవ‌లం స‌భ్యుడిని మాత్ర‌మే.
ఏకాభిప్రాయంతో అధ్య‌క్షుడిగా అవ్వ‌వ‌చ్చు అనే అభిప్రాయం చాలామందిలో వుంది?
ఎల‌క్ష‌న్ అనేది ప్ర‌జాస్వామ్యం. ఏకాభిప్రాయం కుద‌ర‌దు.
 
ఓటింగ్ శాతం త‌క్కువ‌గా వుంటుంది. మ‌రి మిగిలిన ఓట‌ర్స్ ప‌రిస్థితి ఏమిటి?
పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో అయినా 60,70 శాత‌మే ఓటింగ్ వుంటుంది. మా స‌భ్యులు 964 మంది. అందులో 145మంది పెండ్లి చేసుకుని వెళ్ళిపోయారు. మ‌రో 140 మంది వివిధ కార‌ణాల‌వ‌ల్ల దూర‌మ‌య్యారు. ఇంకొంద‌రు పోస్ట‌ల్ ద్వారా వేస్తారు. అస‌లు కోవిడ్ వ‌ల్ల ఎంత‌మంది ఓటింగ్ వేస్తార‌నేది కూడా చూడాలి.
 
`మా భ‌వ‌నం కోసం  విష్ణు  స్థ‌లం చూశార‌న్నారు గ‌దా?
మా అంటే కేవ‌లం భ‌వ‌నం కోసం కాదు. ఇంకా న‌టీన‌టుల స‌మ‌స్య‌లు చాలా వున్నాయి. అవ‌న్నీ ప‌రిష్క‌రించాలి. కేవ‌లం భ‌వ‌నం వ‌ర‌కే అంటే విష్ణును గెలిపిస్తారేమో. నాకు మాత్రం భ‌వ‌నం క‌ట్టేంత స్థాయి నాకులేదు. కానీ నా భ‌వ‌నం విశాల‌మైంది. ఈనెల 19న‌ ఎల‌క్ష‌న్ డేట్ వ‌స్తే ఆ వివ‌రాలు తెలియ‌జేస్తాను.
 
ప్ర‌స్తుతం డ్రెగ్ కేసులు మా స‌భ్యుల‌పై వున్నాయి. వారిని ఏం చేస్తారు?
నాకు డ్రెగ్ అల‌వాటు లేదు. నేను గ్రామ‌ల‌ను ద‌త్త‌త తీసుకుని బాగు చేస్తున్నా. డ్రెగ్ తీసుకున్న వారంతా జాతి వ్య‌తిరేకులే. ఇంకా వారు తీసుకున్న‌ట్లు రుజువులు లేవు. వుంటే ఫ‌స్ట్ నేనే యాక్ష‌న్ తీసుకుంటాను. 
 
pannel list
ప్ర‌కాష్‌రాజ్ సినిమా బిడ్డ‌ల పేన‌ల్ వీరే! 
 
స్పోక్ ప‌ర్స‌న్స్‌గా జ‌య‌సుధ‌, బండ్ల గ‌ణేష్, సాయికుమార్‌, స‌న‌, ప్ర‌కాష్‌రాజ్‌.
 
కోశాధికారిగా నాగినీడు, జాయింట్ సెక‌ట్ర‌రీలుగా అనితా చౌద‌రి, ఉత్తేజ్‌, వైస్ ప్రెసిడెంట్లుగా బెన‌ర్జీ,హేమ‌, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీ‌కాంత్‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జీవితా రాజ‌శేఖ‌ర్‌, 
ఇ.సి. మెంబ‌ర్లు..
18 మంది వుంటారు. అన‌సూయ‌, అజ‌య్‌, భూపాల్‌, బ్ర‌హ్మాజీ, ఈటీవీ ప్ర‌భాకర్‌, గోవింద‌రావు, ఖ‌య్యూం, కౌశిక్‌, ప్ర‌గ‌తి, ర‌మ‌ణారెడ్డి, శ్రీ‌ధ‌ర్‌రావు, శివారెడ్డి, స‌మీర్‌, సుడిగాలి సుధీర్‌, సుబ్బ‌రాజు డి., సురేష్ కొండేటి, త‌నీష్‌, టార్జ‌న్